డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్ల దోపిడీకి వ్యతిరేకంగా మహా ధర్నా
తెలంగాణ ఫిలింఛాంబర్ ఆధ్వర్యంలో డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్స్ క్యూబ్, యుఎఫ్ఓ, పీఎక్స్ డీ అధిక యూజర్ ఛార్జీలు, సినిమా థియేటర్స్ లో తినుబండారాల రేట్స్, సినిమా పైరసీకి వ్యతిరేకంగా తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యాలయం దగ్గర మహాధర్నా నిర్వహించారు. టీఎఫ్ సీసీ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ సారథ్యంలో జరిగిన ఈ మహాధర్నాలో నిర్మాతలు లయన్ సాయి వెంకట్, గురురాజ్, డీఎస్ రెడ్డి, రవి, నటుడు, హీరో సన్నీ, దర్శకుడు సిరాజ్ తో పాటు పలువురు దర్శక నిర్మాతలు, ఆర్టిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఎఫ్ సీసీ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ - తెలుగు సినిమా పరిశ్రమలోని ముగ్గురు ప్రొడ్యూసర్స్ తమ స్వార్థంతో చేస్తున్న నిర్వాకాల వల్ల…
