ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్స్, డ్రామా, ఎగ్రెషన్..ఇలా అన్నీ ఎమోషన్స్‌తో అందరినీ మెప్పించే తెలంగాణ రూటెడ్ ఫిల్మ్ ‘దండోరా’.. ఫుల్లీ కంటెంట్ లోడెడ్ మూవీ : టైటిల్ సాంగ్ ఈవెంట్‌లో నటుడు శివాజీ
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’..బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందిస్తోన్నచిత్రం ‘దండోరా’. ఈ మూవీ శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు పాత్రధారులు. మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 25న మూవీ రిలీజ్ అవుతోంది. శనివారం ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ కార్యక్రమం జరిగింది. ఇందులో... https://www.youtube.com/watch?v=DLRNyoPZCg0&list=PLv8tne3UD07McZj6LGeKv8Rj-oF_FwT8Q నటుడు శివాజీ మాట్లాడుతూ ‘‘తెలంగాణ రూటెడ్ ఫిల్మ్ ఇది. నాకు డైరెక్టర్‌గారు స్క్రిప్ట్ చెప్పగానే ఏం చదువుకున్నారని అడిగాను. నేను అమెరికా నుంచి వచ్చానని ఆయన అన్నాడు. ఈ సినిమా…
