ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో ‘హరి హర వీరమల్లు’లో పవన్ కళ్యాణ్ పాత్ర
పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం 'హరి హర వీరమల్లు' జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం గురించి దర్శకుడు జ్యోతి కృష్ణ ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. 'హరి హర వీరమల్లు' చిత్రంలో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించడానికి దిగ్గజ నటులు ఎన్టీఆర్, ఎంజీఆర్ ల నుండి ప్రేరణ పొందానని జ్యోతి కృష్ణ వెల్లడించారు. ఎన్టీఆర్, ఎంజీఆర్ వంటి దిగ్గజ వ్యక్తుల మాదిరిగానే పవన్ కళ్యాణ్ లో ఉన్న అద్భుతమైన లక్షణాలను గమనించిన తర్వాతే ఆయన పాత్రను రాయడానికి ప్రేరణ పొందానని జ్యోతి కృష్ణ పేర్కొన్నారు. ధర్మపరుడిగా, బలవంతుడిగా మరియు ప్రజల మనిషిగా పవన్ కళ్యాణ్ కి ఉన్న ఇమేజ్ ను…
