‘మారెమ్మ’ షూటింగ్ పూర్తి
మాస్ మహారాజా రవితేజ బ్రదర్ యాక్టర్ రఘు కుమారుడు యంగ్ చాప్ మాధవ్ రూరల్ రస్టిక్ మూవీ 'మారెమ్మ'తో హీరోగా సినిమాల్లోకి అడుగుపెడుతున్నారు. ఈ హై-ఆక్టేన్ ప్రాజెక్ట్‌ను మంచాల నాగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై మయూర్ రెడ్డి బండారు తమ ప్రొడక్షన్ నంబర్ 1గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ లో మాధవ్ ఎద్దును నడిపిస్తూ ధైర్యంగా ముందుకు వస్తూ ఇంటెన్స్ లుక్ లో కనిపించారు. బ్యాక్ డ్రాప్ లో శక్తివంతంగా కనిపించే కాళీదేవి విగ్రహం, చుట్టూ గ్రామీణ పండుగ వాతావరణం, జనసందడి,…
