‘మామన్’.. ఆగస్ట్ 27 నుంచి జీ5 తెలుగు, కన్నడల్లో స్ట్రీమింగ్
- ఆగస్ట్ 8న తమిళంలో స్ట్రీమింగ్.. 27 నుంచి తెలుగు, కన్నడల్లో స్ట్రీమింగ్ భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT ప్లాట్‌ఫారమ్ అయిన ZEE 5 2025లో మరో సూపర్‌హిట్ ప్రీమియర్‌తో ఆడియెన్స్‌ని ఎప్పటికప్పుడు అలరిస్తూనే ఉంది. తాజాగా మరో విజయవంతమైన చిత్రం ‘మామన్’ను ప్రేక్షకులకు అందిస్తోంది. ఆగస్ట్ 8న తమిళంలో ZEE 5 ప్రేక్షకులకు అందిస్తోంది. ఇప్పుడీ చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో ఆగస్ట్ 27 నుంచి ZEE 5లో స్ట్రీమింగ్ కానుంది. భావోద్వేగాలు కలగలిసిన కుటుంబ కథా చిత్రంగా ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం ఇప్పుడు ZEE 5లో స్ట్రీమింగ్ కానుండటంతో మరింత మంది ప్రేక్షకులకు రీచ్ అవుతుంది.