ప్రభాస్ చేతుల మీదుగా ‘శంబాల’ ట్రైలర్ విడుదల
వెర్సటైల్ హీరో ఆది సాయి కుమార్ నటించిన మిస్టికల్ థ్రిల్లర్ ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’ ప్రస్తుతం అందరిలోనూ బజ్‌ను క్రియేట్ చేస్తూ ట్రెండ్ అవుతోంది. మరింత హైప్‌ను పెంచేలా రెబల్ స్టార్ ప్రభాస్ ఈ చిత్రం ట్రైలర్‌ను ఆవిష్కరించి, బృందానికి తన శుభాకాంక్షలు తెలిపారు. ఈ ట్రైలర్‌ను చూస్తే ఆడియెన్స్‌కి ఓ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించబోతోన్నట్టుగా కనిపిస్తోంది. ‘కొన్ని వేల సంవత్సరాల క్రితం పరమశివుడికి, అసురుడికి మధ్య జరిగిన ఓ భీకర యుద్దం.. ఈ కథకి మూలం’ అంటూ సాయి కుమార్ గంభీరమైన వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ఆరంభమైంది. ‘అగ్ని పురాణం ప్రకారం ఆకాశంలో సంగ్రామం జరిగినప్పుడు దుష్ట శక్తులు జంతువుల్ని సైతం ఆవహిస్తాయి’.. ‘వాళ్లేమో చీమ కుట్టినా శివుడి…
