బాల్కనీ ఒరిజినల్స్ బ్యానర్‌లో ‘ప్రొద్దుటూరు దసరా’ని అద్భుతంగా తీసిన ప్రతీ ఒక్కరికీ కంగ్రాట్స్.. డాక్యుమెంటరీ ప్రత్యేక ప్రదర్శనలో దర్శకుడు కరుణ కుమార్
బాల్కనీ ఒరిజినల్స్, బుశెట్టి జువెల్లర్స్ సమర్పణలో ప్రేమ్ కుమార్ వలపల నిర్మాతగా తీసిన డాక్యుమెంటరీ ‘ప్రొద్దుటూరు దసరా’. మురళీ కృష్ణ తుమ్మ ఈ డాక్యమెంటరీని తెరకెక్కించారు. ఈ డాక్యుమెంటరీని శుక్రవారం (సెప్టెంబర్ 5) నాడు ప్రదర్శించారు. ఈ ప్రత్యేక ప్రదర్శనకు కరుణ కుమార్, విప్లవ్, మహేష్ విట్టా, ఉదయ్ గుర్రాల ముఖ్య అతిథులుగా విచ్చేశారు. డాక్యుమెంటరీ స్క్రీనింగ్ అనంతరం.. దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ .. ‘ఓ ఘటన లేదా, వ్యక్తికి సంబంధించిన విషయాల్ని, నిజాల్ని చూపించే డాక్యుమెంటరీస్ ఉంటాయి. ఓ సరైన డాక్యుమెంటరీకి సినిమా కంటే పెద్ద రీచ్ ఉంటుంది. డాక్యుమెంటరీ అంటే ఎంగేజింగ్‌గా ఉండదని అంతా అనుకుంటారు. కానీ ఈ ‘ప్రొద్దుటూరు దసరా’ ఎంతో ఎంగేజింగ్‌గా, అద్భుతంగా అనిపించింది. డాక్యుమెంటరీ…
