Skip to content

‘మన శంకరవర ప్రసాద్ గారు’ మీసాల పిల్ల సాంగ్ కి 50 మిలియన్ల వ్యూస్

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మన శంకరవరప్రసాద్ గారు' ఫస్ట్ సింగిల్ మీసాల పిల్ల' 50 మిలియన్ల వ్యూస్ క్రాస్ చేసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలుగు సినిమా మ్యూజిక్ కి కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పింది. హిట్‌మెషిన్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం పండగ వాతావరణంలో, కుటుంబమంతా కలిసి చూసేలా ఉండే ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది. ఆ వైబ్‌ను అద్భుతంగా అందించిన సాంగ్‌ “మీసాల పిల్ల”. భీమ్స్‌ సెసిరోలియో అందించిన ఎనర్జిటిక్‌ ట్యూన్‌, బీట్‌లతో ఈ పాట దేశవ్యాప్తంగా చార్ట్‌బస్టర్‌గా మారింది. తెలుగు పాటగా ఇంత పెద్ద స్థాయిలో పాన్‌-ఇండియా రీచ్‌ సాధించడం అరుదైన ఘనత. మెగాస్టార్‌ చిరంజీవి తన సిగ్నేచర్‌ చార్మ్‌, ఎక్స్ప్రెషన్స్‌, ఎనర్జిటిక్‌ డ్యాన్స్‌ మూవ్స్‌తో…

Read more

చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ షూటింగ్‌లో జాయిన్ అయిన విక్టరీ వెంకటేష్

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2026 సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు రానుంది. కామెడీ, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్‌ కలగలిపిన ఈ సినిమా పండగ సీజన్‌కు పర్ఫెక్ట్ ట్రీట్. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. F2’, ‘F3’ లాంటి లాఫ్ రయాట్స్ ఇచ్చిన అనిల్ రావిపూడి, ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మరోసారి విక్టరీ వెంకటేశ్‌తో జట్టుకట్టారు. ఐకానిక్ హీరోస్ చిరంజీవి – వెంకటేశ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం అభిమానులకు డబుల్ ఫెస్టివల్‌. ఈ…

Read more

క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి, హిట్ మోషన్ అనిల్ రావిపూడి మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు షూటింగ్ వేగంగా జరుగుతోంది. చిత్రీకరణలో బిజీగా ఉన్న చిరంజీవి, ఒక మంచి సందర్భానికి సమయం కేటాయించారు. ఇటీవల ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత్ ఘనవిజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన యువ క్రికెటర్ తిలక్ వర్మను మెగాస్టార్ సన్మానించారు. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఆడుతూ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారత్ విజయంలో కీలకమైన భాగస్వామి అయిన తిలక్ వర్మ ప్రతిభను చిరంజీవి అభినందించారు. తన సహజమైన వినయం, పెద్ద మనసుతో చిరంజీవి, తిలక్ వర్మను ఆప్యాయంగా ఆహ్వానించారు. ఆయనకు శాలువా కప్పి, మ్యాచ్‌లోని ఆయన మెమొరబుల్ మూమెంట్ ని ఫ్రేమ్ చేసిన ఫోటోను అందజేశారు…

Read more

‘మన శంకరవరప్రసాద్ గారు’ నుంచి మీసాల పిల్ల సాంగ్‌ రిలీజ్‌

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ ప్రోమోకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ వీడియో రికార్డ్ వ్యూస్‌ను సాధించింది, ఇప్పటికే లెక్కలేనన్ని ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ తో సంచలనం సృష్టించింది. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయిక. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను శ్రీమతి అర్చన గర్వంగా సమర్పిస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మీసాల పిల్ల లిరికల్ వీడియో విడుదలైంది. భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ ట్రాక్ పవర్ ఫుల్ ఎలక్ట్రానిక్ బీట్స్, పంచ్ బాస్…

Read more