‘మర్దానీ 3’కి వెల్లువెత్తిన కలెక్షన్స్
యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ‘మర్దానీ 3’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. మర్దానీ ఫ్రాంచైజీలో భాగంగా వచ్చిన ఈ మూడో పార్ట్ భారీ కలెక్షన్లను నమోదు చేసింది. మర్దానీ 3 ఇప్పటికే మర్దానీ ఫ్రాంచైజీలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇది ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 50 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 75 కోట్లు క్రాస్ చేసి ఓ మైలు రాయిగా రాణి ముఖర్జీ కెరీర్‌లో నిలిచిపోయింది. ఈ మేరకు రాణి ముఖర్జీ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ .. ‘‘మర్దానీ 3’ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్. నేను వారికి ఎప్పుడూ కృతజ్ఞురాలిని. ‘ఆల్ఫా మేల్’ పాత్రలతో తీసిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న…
