రవితేజ ‘మాస్ జతర’ ట్రైలర్ విడుదల
మాస్ మహారాజా రవితేజ అభిమానులతో పాటు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'మాస్ జతర' సినిమా ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. రవితేజ నుండి అభిమానులు, ప్రేక్షకులు ఆశించే అసలుసిసలైన మాస్ వేడుకలా ఈ ట్రైలర్ ఉంది. రైల్వే పోలీస్ అధికారిగా రవితేజ తనదైన శైలిలో ఒదిగిపోయిన తీరు కట్టిపడేసింది. రవితేజ అంటేనే ఉత్సాహంతో తెర వెలిగిపోతుంది. ఆ ఉత్సాహం 'మాస్ జతర' ట్రైలర్ లో అడుగడుగునా కనిపించింది. భారీ యాక్షన్ సన్నివేశాలు, అదిరిపోయే పంచ్ డైలాగ్‌లతో మాస్ మహారాజా అభిమానులు కోరుకునే మాస్ విందులా ఈ ట్రైలర్ ను మలిచారు. కథానాయకుడు, ప్రతినాయకుడు మధ్య ఉత్కంఠభరితమైన సంఘర్షణ నేపథ్యంలో ట్రైలర్ ను రూపొందిన తీరు ఆకట్టుకుంది. వాణిజ్య అంశాలతో నిండిన పూర్తి స్థాయి…
