చిరంజీవి గారి పుట్టిన రోజున ‘త్రిబాణధారి బార్బరిక్’ విడుదల చేస్తుండటం ఆనందంగా ఉంది.. సత్య రాజ్
స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల నిర్మిస్తున్న చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. ఈ మూవీకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. పాన్ ఇండియన్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంలో వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్, ఉదయభాను, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ వంటి వారు ప్రధాన పాత్రల్ని పోషించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ క్రమంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో.. సత్య రాజ్ మాట్లాడుతూ .. ‘‘త్రిబాణధారి బార్బరిక్’ సినిమాలో పని చేసినందుకు ఆనందంగా ఉంది. మేమంతా కూడా మాదే మెయిన్ పాత్ర అని చెప్పుకోవచ్చు. కానీ ఇందులో కథే…