‘వారణాసి’ 2027 ఏప్రిల్ 7న విడుదల
ప్రస్తుతం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న భారతీయ చిత్రాలలో ఒకటిగా ‘వారణాసి’ నిలిచింది. మహేష్ బాబు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళితో కలిసి తొలిసారిగా చేస్తున్న చిత్రం 'వారణాసి'. ఈ మూవీని శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్లో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం నుంచి వస్తున్న ప్రతీ అప్డేట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నవంబర్లో జరిగిన గ్లోబ్ ట్రోట్టర్ ఈవెంట్ అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇటీవల విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకుల్లో అంచనాల్ని తారాస్థాయికి పెంచేసింది. త్రేతాయుగంలో ప్రారంభమై, వారణాసిలో 512 CE గుండా ప్రయాణించి, 2027 CEకి మారి, త్రేతాయుగం…
