‘ఫంకీ’ 2026 ఏప్రిల్ 3న విడుదల
మాస్ కా దాస్ విశ్వక్ సేన్, కె.వి. అనుదీప్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ 'ఫంకీ' ఏప్రిల్ 3, 2026న విడుదల వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి. అనుదీప్ కలయికలో రూపొందుతోన్న చిత్రం 'ఫంకీ'. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్ర విడుదల తేదీ వచ్చేసింది. ఇటీవల విడుదలైన టీజర్‌కు ప్రేక్షకులు ఇచ్చిన అద్భుతమైన స్పందనతో ఉత్సాహంలో ఉన్న 'ఫంకీ' చిత్ర బృందం, ఈ సినిమాను 2026 ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది. టీజర్ తో వినోదాల విందుకి హామీ ఇచ్చిన ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న వినోదభరిత…
