‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ రిలీజ్‌కు 100 రోజులు మాత్రమే
‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ రిలీజ్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. మార్చి 19, 2026న సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. అంటే సినిమా రిలీజ్‌కు మరో వంద రోజుల సమయం మాత్రమే ఉంది. వచ్చే ఏడాది అందరూ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తోన్న సినిమాల్లో ఇదొకటి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్‌తో సినిమాపై అంచనాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లేలా చిత్ర యూనిట్ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ నుంచి ఓ సరికొత్త, పవర్ఫుల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. సెక్సీ, రగ్డ్ లుక్‌లో యష్ ఇందులో కనిపిస్తున్నాడు. మెలి తిరిగిన కండలతో తనొక…
