కొదమసింహం” సినిమా నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ, ప్రేక్షకులు ఈ సినిమా రీ రిలీజ్ ను తప్పకుండా థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తారు – మెగాస్టార్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో సక్సెస్, జానర్ పరంగా చూస్తే ఒక ప్రత్యేకమైనదిగా "కొదమసింహం" సినిమాను చెప్పుకోవచ్చు. చిరంజీవి నటించిన ఒకే ఒక కౌబాయ్ సినిమా ఇది. 1990, ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సాధించిన "కొదమసింహం" సినిమాను ఈ నెల 21వ తేదీన 4కే కన్వర్షన్, 5.1 డిజిటల్ సౌండింగ్ తో సరికొత్తగా రమా ఫిలింస్ అధినేత కైకాల నాగేశ్వర రావు రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ప్రెస్ ప్రీమయర్ షో, ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో స్పెషల్ వీడియో ద్వారా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ - కొదమసింహం…
