తెలుగు టెలివిజన్ డిజిటల్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నూతన కార్యవర్గ సభ్యుల ఏకగ్రీవ ఎన్నిక…
2025– 2027వ సంవత్సరానికి ‘‘తెలుగు టెలివిజన్ డిజిటల్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్’’ నూతన కార్యవర్గం సారధులు ఎన్నికయ్యారు. ప్రెసిడెంట్‌గా ఏ.ప్రసాదరావు (సోనోపిక్స్ ప్రసాద్) వైస్ ప్రెసిడెంట్‌గా పి.ప్రభాకర్, యన్.అశోక్‌లు ఎన్నికవ్వగా జనరల్ సెక్రటరీగా యం.వినోద్‌బాల జాయింట్ సెక్రటరీలుగా నటుడు–నిర్మాత కె.వి శ్రీరామ్, గుత్తా వెంకటేశ్వరరావు, ట్రెజరర్‌గా డి.వై చౌదరి ఎన్నికయ్యారు. గత 14 ఏళ్లుగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా తమ సభ్యులకు ఉపయోగపడే విధంగా వాలంటీర్గా గా పనులు చేసి అందరితో శహభాష్ అనిపించుకునే ఏకైక యూనియన్ మాది అని ప్రెసిడెంట్ ప్రసాద్‌రావు అన్నారు. ఎటువంటి ఎన్నికల హడావిడి లేకుండా, రాగద్వేషాలు లేకుండా ఏకగ్రీవంగా తమ సభ్యులను ఎన్నుకుంటున్న ఏకైక యూనియన్ మా టిటిడిఓపిసి సంస్థ అన్నారు జనరల్ సెక్రటరీ వినోద్‌బాల…
