Skip to content

స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి వీరాభిమాని ఎన్టీఆర్ రాజు పాడె మోసిన నందమూరి కుటుంబ సభ్యులు నందమూరి రామ కృష్ణ, నందమూరి మోహనకృష్ణ

స్వర్గీయ నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) వీరాభిమాని, అందరితో 'ఎన్టీఆర్ రాజు'గా పిలిపించుకునే రామచంద్ర రాజు మృతి పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గురువారం ఆయన భౌతికకాయానికి నందమూరి రామకృష్ణ, నందమూరి మోహన్ రూప, నందమూరి చైతన్య కృష్ణ, నందమూరి కుటుంబ సభ్యులు, శాప్ ఛైర్మన్ రవి నాయుడు, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ , తిరుపతి టౌన్ బ్యాంక్ మాజీ ఛైర్మన్, ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, మురళి, ఎక్స్ ఎమ్మెల్యే సుగుణమ్మ, శ్రీనాథ్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్, అడిషనల్ ఈవో అంకం చౌదరి, పలువురు రాజకీయ ప్రముఖులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు, నాయకులు మాట్లాడుతూ..…

Read more

కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం రాతన గ్రామంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నూతన విగ్రహాన్ని ఆవిష్కరించిన నందమూరి మోహనకృష్ణ, నందమూరి రూప

ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని పత్తికొండ నియోజకవర్గం రాతన గ్రామంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నూతన విగ్రహావిష్కరణ జరిగింది. ఎన్టీఆర్ గారి కుమారుడు నందమూరి మోహనకృష్ణ, మనవరాలు నందమూరి మోహన రూపా, పత్తికొండ ఎమ్మెల్యే శ్యాం బాబు చేతుల మీదగా ఈ విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగు ఫిలిం ఛాంబర్ సెక్రటరీలు తుమ్మల ప్రసన్న కుమార్ గారు, వైవిఎస్ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కుమారుడు నందమూరి మోహన్ కృష్ణ గారు మాట్లాడుతూ... "అందరికి నమస్కారం. ఈరోజు ఎంతో ముఖ్యమైన రోజు ఎందుకంటే పత్తికొండ నియోజకవర్గం లో మా నాన్నగారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహం ప్రతిష్టించడం…

Read more

అభిమానుల ప్రేమ వల్లే ఈ విజయాల్ని, రికార్డుల్ని సాధించాను – నందమూరి బాలకృష్ణ

నందమూరి నటసింహం బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో ఆయన పేరు వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోకి ఎక్కింది. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఈ అరుదైన గౌరవానికి ఎంపికైన తొలి హీరో బాలకృష్ణనే కావడం విశేషం. వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ యూకే గోల్డ్ ఎడిషన్‌లో స్థానం కల్పించినట్టుగా సీఈవో సంతోష్ శుక్లా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ బాలకృష్ణను ఘనంగా సత్కరించింది. ఈ మేరకు శనివారం (ఆగస్ట్ 30) నాడు నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ గారు, ఏపీ ఐటీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు, సహజ…

Read more