నందు, అవికా గోర్ జంటగా నటిస్తున్న ‘అగ్లీ స్టోరీ’ ఇంటెన్స్ టీజర్ విడుదల
నందు, అవికా గోర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'అగ్లీ స్టోరీ'. రియా జియా ప్రొడక్షన్స్ పతాకం మీద సీహెచ్ సుభాషిణి, కొండా లక్ష్మణ్ నిర్మిస్తున్నారు. ప్రణవ స్వరూప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్, 'హే ప్రియతమా' లిరికల్ సాంగ్ రిలీజ్ ఎక్సట్రాడినరీ రెస్పాన్స్ అందుకున్నాయి. దసరా సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు చెబుతూ ఇంటెన్స్ టీజర్ రిలీజ్ చేశారు. మంటల మీదుగా సిగరెట్ కాలుస్తున్న నందును 'అగ్లీ స్టోరీ' టీజర్‌లో ముందుగా పరిచయం చేశారు. అతడిది పర్వర్ట్ క్యారెక్టర్ అన్నట్టు సన్నివేశాలు ఉన్నాయి. తర్వాత అవికా గోర్ పరిచయం జరిగింది. నందును కాకుండా అవికా గోర్ మరొక అబ్బాయిని ప్రేమిస్తుంది. మరొకరిని ప్రేమించానని, పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటున్నామని అవికా గోర్ చెప్పినా…
