నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా ఆది సాయి కుమార్ ‘శంబాల’ మిస్టికల్ ట్రైలర్ విడుదల
షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మాతలుగా వెర్సటైల్ యాక్టర్ ఆది సాయి కుమార్ హీరోగా రానున్న చిత్రం ‘శంబాల’. యగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ తదితరులు కీలక పాత్రల్ని పోషించారు. ఈ సినిమాను డిసెంబర్ 25న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ ఆడియెన్స్‌ను మెప్పించాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో అంచనాల్ని మరింతగా పెంచేందుకు శంబాల మిస్టిక్ ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని చేత ఆదివారం నాడు విడుదల చేయించారు. ట్రైలర్ రిలీజ్ చేసిన అనంతరం నాని మాట్లాడుతూ.. ‘‘శంబాల’…
