బాణామతి బ్యాక్ డ్రాప్ లో చేతబడి చిత్రం
శ్రీ శారద రమణా క్రియేషన్స్ బ్యానర్ పై నంద కిషోర్ నిర్మాణంలో నూతన దర్శకుడు సూర్యాస్ రూపొందిస్తున్న చిత్రం చేతబడి రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ కథను గురించి తెలియజేస్తూ దర్శకుడు సూర్యాస్ మాట్లాడుతూ.."చేతబడి అనేది 16 వ శతాబ్దంలో మన ఇండియాలో పుట్టిన ఒక కల. రెండు దేశాలు కొట్టుకోవాలన్న రెండు దేశాలు కలవాలన్న.. ఒక బలం బలగంతో ఉండాలి. కానీ ఒక ఈవిల్ ఎనర్జీతో మనిషిని కలవకుండా అతన్ని చంపే విద్యే చేతబడి. అది ఎంత భయంకరంగా ఉంటుందో ఇప్పటికే చాలా సినిమాల్లో చూపించారు. ఇందులో చాలా విభిన్నంగా చూపిస్తున్నాం. మన బాడీలో ప్రతిదానికి ఒక ప్రాణం ఉంటుంది. జుట్టుకు కూడా ఒక ప్రాణం ఉంటుంది…
