“ఆపరేషన్ పద్మ” ట్రైలర్ విడుదల
నరేష్ మేడి, రాగ్, రజిత శాండీ, రణధీర్ బీసు, రాఘవ మందలపు, పెద్ది రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "ఆపరేషన్ పద్మ". ఈ చిత్రాన్ని క్రిషవ్ సినిమాస్, కేవీఎం ఆర్ట్స్ ఎల్ఎల్పీ బ్యానర్స్ పై ఘట్టమనేని అరవింద్ బాబు, రాఘవ మందలపు, రాంబాబు మందలపు నిర్మిస్తున్నారు. కార్తీక్ మందలపు కో ప్రొడ్యూసర్ గా, కె టి మల్లికార్జున క్రియేటివ్ హెడ్ గా వ్యవహరిస్తున్నారు. కార్తికేయ.వి. దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆదివారం "ఆపరేషన్ పద్మ" సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైలాగ్ రైటర్ ప్రేమ్ రాజ్ ఎనుముల మాట్లాడుతూ - "ఆపరేషన్ పద్మ" సినిమాను…
