ఈటీవి విన్‌లో ‘యుఫోరియా’ భారీ సౌండ్: గుణశేఖర్
సెన్సేషనల్ డైరెక్టర్ గుణ శేఖర్ దర్శకత్వంలో భూమిక, సారా అర్జున్ ప్రధాన పాత్రలలో నాజర్, రోహిత్, విఘ్నేశ్ గవిరెడ్డి కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘యుఫోరియా’. రాగిణి గుణ సమర్పణలో నీలిమ గుణ & యుక్త గుణ నిర్మాతలుగా తెరకెక్కించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఏప్రిల్ 2నుంచి ఈటీవి విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీస్ట్రీమింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ప్రీస్ట్రీమింగ్ సెలబ్రేషన్స్ లో డైరెక్టర్ గుణశేఖర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. అసిస్టెంట్ డైరెక్టర్‌గా నా కెరీర్ రామోజీ రావు గారి ఉషా కిరణ్ మూవీస్ సంస్థలోనే ప్రారంభమైంది. నేను బాగా పని చేస్తున్నానని ఆయన నన్ను ప్రోత్సహించారు. ఉషా కిరణ్ మూవీస్ స్టాండర్డ్స్ చాలా అద్భుతంగా…
