అనగనగా ఒక రాజు’ చిత్రం నుంచి ‘రాజు గారి పెళ్లిరో’ విడుదల
వరుసగా మూడు ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి, 2026 సంక్రాంతికి తన తదుపరి చిత్రం 'అనగనగా ఒక రాజు'తో అలరించనున్నారు. ప్రచార చిత్రాలలో వైవిధ్యం చూపిస్తూ, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన మొదటి గీతం 'భీమవరం బాల్మా' ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుంచి రెండవ గీతంగా 'రాజు గారి పెళ్లిరో' విడుదలైంది. 'అనగనగా ఒక రాజు' నుంచి డ్యాన్స్ నంబర్ గా విడుదలైన 'రాజు గారి పెళ్లిరో' పాట కట్టిపడేస్తోంది. మాస్ తో పాటు, అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఉత్సాహభరితంగా సాగిన ఈ గీతం.. పండగ వాతావరణాన్ని ముందే తీసుకొని వచ్చింది. తెలుగు ప్రేక్షకుల…
