Skip to content

#NBK111 గ్రాండ్ గా లాంచ్

వరుస బ్లాక్‌బస్టర్‌ల దూసుకెళ్తున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, వీరసింహారెడ్డి సంచలన విజయం తర్వాత బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేనితో మరోసారి చేతులు కలిపారు. ఈ ఇద్దరి కొలాబరేషన్ లో హిస్టారికల్ ఎపిక్ #NBK111 చిత్రాన్ని ప్రతిష్టాత్మక వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. బాలకృష్ణ సరసన నయనతార కథానాయికగా నటిస్తున్నారు. సింహ, జై సింహా, శ్రీ రామరాజ్యం తర్వాత బాలకృష్ణ, నయనతార కలిసి నటిస్తున్న నాల్గవ చిత్రం ఇది. ఈ ప్రాజెక్టు నేడు హైదరాబాద్‌లో ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ స్క్రిప్ట్‌ను నిర్మాతలకు అందజేశారు. బాలకృష్ణతో అనేక బ్లాక్‌బస్టర్‌లను అందించిన దర్శకుడు బి గోపాల్…

Read more