న్యూ కాన్సెప్ట్‌తో నిర్మించిన ‘జిన్’ అందరినీ ఆకట్టుకుంటుంది.. చిత్ర నిర్మాత నిఖిల్ ఎం. గౌడ
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీలో అమ్మిత్ రావ్, పర్వేజ్ సింబా, ప్రకాష్ తుమినాద్, రవి భట్, సంగీత వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ సినిమాకు చిన్మయ్ రామ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం డిసెంబర్ 19న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్‌లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో నిర్మాత నిఖిల్ ఎం గౌడ మీడియాతో మాట్లాడుతూ చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏం చెప్పారంటే * మాది బెంగళూరు. నాకు చిన్నతనం నుంచీ సినిమాలంటే ఇష్టం. ఎక్కువగా తెలుగు…
