Skip to content

ఏప్రిల్ 3న సువర్ణ విడుదల

ఆరాధ్య క్రియేషన్స్ పతాకం పై పల్లవి, షకలక శంకర్, జగదీష్, వర్ణిక, జబర్దస్త్ రాజమౌళి, పవన్, దేవి, శివ, శ్రీహరి ముఖ్య పాత్రలో అశోక్ రొయ్య స్వీయ దర్శకత్వం లో ఏప్రిల్ 3న విడుదల అవుతున్న రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం "సువర్ణ". ఈ సందర్భంగా దర్శక నిర్మాత అశోక్ రొయ్య మాట్లాడుతూ "సువర్ణ ఒక రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం. మొబైల్ ఫోన్ కి బానిస అయిన సువర్ణ, తాను ఎలా చనిపోయింది, తను దెయ్యం గా ఎందుకు మారుతుంది అనేదే ఈ చిత్ర కదా. సినిమా చాలా బాగా వచ్చింది, డిఫరెంట్ గా ఉంటుంది. మా నటీనటులు పల్లవి, షకలక శంకర్, జగదీష్, వర్ణిక, జబర్దస్త్ రాజమౌళి, పవన్, దేవి,…

Read more

ఘనంగా సైన్స్‌ ఫెయిర్‌

మెహిదీపట్నంలోని శ్రీచైతన్య పాఠశాలలో నేషనల్‌ సైన్స్‌ డేని పురస్కరించుకుని సైన్స్ ఫెయిర్‌ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం జోన్‌ ఏజీఎం బి. కృష్ణ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్వయంగా తయారు చేసిన వివిధ రకాల ప్రాజెక్టులను వైజ్ఞానిక ప్రదర్శనలో ఉంచారు. వాటిని బి. కృష్ణ, ఆర్‌ఐ, ప్రిన్సిపల్‌ ఎన్‌. స్వాతి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మెహిదీపట్నం శ్రీచైతన్య పాఠశాల డీన్‌ మల్లేష్, ప్రైమరీ ఇన్‌చార్జ్‌ పల్లవి, ప్రీ ప్రైమరీ ఇన్‌చార్జ్‌ పుష్ప, ఐపీఎల్‌ ఇన్‌చార్జ్‌ బాలరాజు, సి–బ్యాచ్‌ ఇన్‌చార్జ్‌ ఆంజనేయులు, కోఆర్డినేటర్స్‌ జైపాల్, జనార్ధన్, టీచర్లు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు

Read more

మెహిదీపట్నం శ్రీచైతన్య పాఠశాలలో ఘనంగా నేషనల్‌ మేథమాటిక్స్‌ డే

మెహిదీపట్నంలోని శ్రీచైతన్య పాఠశాలలో సోమవారం శ్రీనివాస రామానుజన్‌ జయంతిని పురస్కరించుకుని నేషనల్‌ మేథమాటిక్స్‌ డేని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస రామానుజన్‌ చిత్రపటం వద్ద నివాళి అర్పించారు. విద్యార్థులు రామానుజన్‌ వేషధారణల్లో హాజరై, తమదైన స్పీచ్‌లతో ఆకట్టుకున్నారు. అదేవిధంగా మేథమాటిక్స్‌ క్విజ్, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం జోన్‌ ఏజీఎం కృష్ణ, ఆర్‌ఐ, ప్రిన్సిపల్‌ ఎన్‌. స్వాతి చేతులమీదుగా ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులతో పాటు మెడల్స్, సర్టిఫికెట్స్‌ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డీన్‌ మల్లేష్, ప్రైమరీ ఇన్‌చార్జ్‌ పల్లవి, కోఆర్డినేటర్స్‌ అఖిల్, జనార్ధన్, ఇన్‌చార్జులు బాలరాజు, ఆంజనేయులు, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

Read more

ఘనంగా క్రీడా దినోత్సవం

మెహిదీపట్నంలోని శ్రీ చైతన్య పాఠశాలలో వారం రోజులుగా క్రీడా దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ప్రముఖ హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌ చంద్‌ జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు క్రీడా పోటీలు నిర్వహించారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాల్ని ప్రదర్శించారు. క్రీడా దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా శనివారం నిర్వహించిన ముగింపు వేడుకకి శ్రీచైతన్య స్కూల్స్‌ మెహిదీపట్నం జోన్‌ ఏజీఎం కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని కోరారు. ప్రిన్సిపల్‌ ఎన్‌.స్వాతి మాట్లాడుతూ–‘‘విద్యార్థులకు క్రీడలు ఎంతో అవసరం. క్రీడల వల్ల మానసిక ఉల్లాసం, ఉత్సాహం కలుగుతుంది. విద్యా వికాసానికి ఆటలు అనేవి దోహద పడతాయి. ప్రతి ఒక్కరూ క్రీడల్లోనూ ప్రతిభ చాటాలి’’ అని చెప్పారు…

Read more

ఘనంగా అధికార ప్రదానోత్సవం

మెహిదీపట్నంలోని శ్రీ చైతన్య పాఠశాలలో అధికార ప్రదానోత్సవం(ఇన్వెస్టిచర్‌ సెర్మనీ) కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. 2025–2026 ఏడాదికి సంబంధించి విద్యార్థులకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ వెంకటేశ్వర్లు, అపోలో హాస్పిటల్‌ వైద్యురాలు జేబ కలీల్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ–‘‘విద్యార్థులు చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. తల్లితండ్రులు ఆశలు, టీచర్లు ఆకాంక్షలను విద్యార్థులు నెరవేర్చాలి. అదేవిధంగా అంకితభావం, వినయం, విధేయత, సమాజానికి సేవ చేయడం వంటి అంశాలను కూడా అలవర్చుకోవాలి’’ అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం జోన్‌ ఏజీఎం కృష్ణ, ప్రిన్సిపల్‌ ఎన్‌.స్వాతి, డీన్‌ మల్లేష్,…

Read more