‘పంజరం’ ట్రైలర్ విడుదల
సే స్టోరీ ప్రొడక్షన్స్, ఆర్3 ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఆర్ రఘన్ రెడ్డి నిర్మాతగా సాయి కృష్ణ దర్శకత్వంలో అనిల్, యువతేజ, ముస్కాన్, రూప ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం ‘పంజరం’. కొత్త వాళ్లంతా కలిసి చేసిన ఈ హారర్ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను బుధవారం నాడు రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ మాత్రం వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది. పేదరాసి పెద్దమ్మ అంటూ ఓపెన్ చేసిన ట్రైలర్, ఊరుని చూపించిన తీరు, హారర్ ఎలిమెంట్స్ అన్నీ కూడా రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్నాయి. హారర్ మూవీకి ఉండాల్సిన కెమెరా వర్క్, ఆర్ఆర్ ‘పంజరం’లో కనిపించాయి. ట్రైలర్‌లో చివరి షాట్ మాత్రం అందరినీ భయపెట్టించేలానే ఉంది. ఈ ట్రైలర్ లాంఛ్ చేసిన అనంతరం ఈ కార్యక్రమంలో.…
