ప్రజల క్షేమం కోసం…
ఉత్తరాఖండ్ వరదల నుంచి ప్రజలందరూ క్షేమంగా ఉండాలంటూ బద్రీనాథ్ ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా బద్రీనాథ్ దాం ధర్మాధికారి ఆధ్వర్యంలో శాంతి హోమాలు చేశారు. ఈ కార్యక్రమాల్లో హైదరాబాదుకు చెందిన పరాశర శ్రీరామ భట్టాచార్య స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘ప్రకృతి శాంతించాలి. ప్రజలందరూ వరదల నుంచి క్షేమంగా ఉండాలి. ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఉండకూడదని ప్రార్థించాను’’ అన్నారు.
