పలువురు తెలుగు సినీ దిగ్గజాల సమక్షంలో ఘనంగా “సోగ్గాడు” స్వర్ణోత్సవ కార్యక్రమం
నటభూషణ్ శోభన్ బాబు కథానాయకుడిగా రూపొందిన "సోగ్గాడు" చిత్రం 50 ఏళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా సురేష్ ప్రొడక్షన్స్, అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో "సోగ్గాడు" సినిమా స్వర్ణోత్సవ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ లోని కొమరం భీమ్ ఆదివాసీ భవన్ లో ఘనంగా జరిగింది. పలువురు ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, హీరోయిన్స్, రచయితలు ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ - రచయితగా నన్ను నేను నమ్ముకుని 1975లో చిత్ర పరిశ్రమకు వచ్చాను. ఆ ఏడాది "సోగ్గాడు" సినిమా రిలీజైంది. ఆ సినిమా తర్వాత శోభన్ బాబు గారు హీరోగా ఒక్కో మెట్టు పైకి అధిరోహిస్తూ వెళ్లారు. శోభన్ బాబు గారికి మహిళా…
