‘పతంగ్’ టీమ్‌ను అభినందించిన ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్
సినీ పరిశ్రమలో నూతన టాలెంట్ ఎక్కడా కనిపించినా కొంత మంది దర్శకులు, హీరోలు ఆ టీమ్ క్రియేటివిటిని, వర్క్‌ను అభినందిస్తుంటారు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో ఒకరు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇటీవల పతంగ్ సినిమా ట్రైలర్‌ను, ఆ టీమ్ చేస్తున్నప్రమోషన్ కంటెంట్, ఆ సినిమా కాన్సెప్ట్ గురించి విని ఇంప్రెస్ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ టీమ్‌ను పిలిచి అభినందించడంతో పాటు టీమ్‌కు తన బెస్ట్ విషెస్ అందజేశాడు. పతంగుల పోటీ నేపథ్యంలో ఇలాంటి కాన్సెప్ట్‌తో సౌత్ ఇండియాలోనే మొదటిసారిగా మీ టీమ్ చేస్తున్న ప్రయత్నం విజయవంతం కావాలని ఆయన కోరుకున్నారు.నాకెందుకో ఈ సినిమా ఆడుతుందని అనిపిపిస్తుంది అని త్రివిక్రమ్ గారు ఎంతో పాజిటివ్‌గా మాట్లాడటంతో పతంగ్ టీమ్ ఎంతో ఎనర్జీతో…
