పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ షూటింగ్ పూర్తి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శక్తివంతమైన పాత్ర గంభీరగా అలరించనున్న చిత్రం 'ఓజీ'. పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల్లో ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ 'ఓజీ' చిత్రీకరణ పూర్తయిందని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా నిర్మాతలు ఒక ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేశారు. వర్షంలో తడుస్తూ కారు దిగి గన్ తో ఫైర్ చేస్తున్న పవన్ కళ్యాణ్ పోస్టర్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న 'ఓజీ' ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. 2025 సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ…