Skip to content

పాయల్ రాజ్‌పుత్ ‘వెంకటలచ్చిమి’ బర్త్ డే పోస్టర్ రిలీజ్

‘ఆర్‌ఎక్స్‌ 100’ ‘మంగళవారం’ వంటి సినిమాలతో యూత్ ఆడియ‌న్స్‌కు హాట్ ఫేవ‌రేట్ హీరోయిన్‌గా మారిన‌ పాయల్‌ రాజ్‌పుత్ ఈ సారి ‘వెంకటలచ్చిమి’ గెట‌ప్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. పాయల్‌ రాజ్‌పుత్ జన్మదినం సందర్భంగా డైరెక్ట‌ర్ ముని తెర‌కెక్కిస్తున్న ఆమె అప్ కమింగ్ మూవీ ‘వెంకటలచ్చిమి’ బర్త్ డే పోస్టర్ ను విడుదల చేశారు. పోస్టర్‌ చూస్తేనే సినిమా ఎంత ఇంటెన్స్‌గా, ఎంత థ్రిల్లింగ్‌గా ఉండబోతోందో అర్థమవుతోంది. రాజా,పవన్ బండ్రేడ్డి నిర్మిస్తున్న‌ ‘వెంకటలచ్చిమి’ మూవీ బర్త్ డే పోస్టర్ లో హీరోయిన్‌ను ఒక జైలు గదిలో పైకప్పుకు తలక్రిందులుగా వ్రేలాడితీసి చేతికి సంకెళ్లు, మేడలో మంగళసూత్రం ఉంచినట్టు కనిపిస్తుంది. రక్తపు మరకలు, మద్యన భయానక వాతావరణం.. అన్ని కలిసి పోస్టర్‌కి ప‌వ‌ర్‌ఫుల్‌ టచ్‌ను ఇస్తున్నాయి…

Read more

పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం ఆమె తండ్రి క‌న్నుమూత‌

టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఇంట విషాదం నెల‌కొంది. ఆమె తండ్రి 'విమల్ కుమార్ రాజ్ పుత్ (68) కన్నుమూశారు. ఈ నెల 28న సాయంత్రం హైద‌రాబాద్‌లో అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు ఈరోజు (జూలై 30న) ఢిల్లీలో నిర్వహించనున్నారు. పాయ‌ల్ రాజ్‌పుత్ త‌న తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ... ''నా పక్కన లేకపోయినా, మీ ప్రేమ నన్ను ప్రతిరోజూ నడిపిస్తుంది. మీ చిరునవ్వు, మీ గొంతు, మీ ఉనికి నాకు చాలా గుర్తుంది. మీరు ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోవచ్చు, కానీ నా హృదయం నుండి ఎప్పటికీ వెళ్ళిపోరు. లవ్ యు నాన్న..'' అంటూ పోస్టు చేసింది. పాయల్ రాజ్‌పుత్ ‘RX 100’, ‘వెంకీ…

Read more