Skip to content

భట్టి విక్రమార్క చేతుల మీదుగా ‘పిఠాపురంలో’ టైటిల్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

‘ప్రేయసి రావే’ ఫేమ్‌ మహేష్‌చంద్ర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పిఠాపురంలో’. దీనికి ఉపశీర్షిక ‘అలా మొదలైంది’. డా. రాజేంద్రప్రసాద్‌, పృధ్వీరాజ్‌, కేదార్‌ శంకర్‌,మణిచందన, సన్నీ అఖిల్, విరాట్‌, సాయిప్రణీత్ , శ్రీలు, ప్రత్యూష తదితరులు ఈ చిత్ర ప్రధాన తారాగణం. మహేష్‌చంద్ర సినిమా టీమ్‌ పతాకంపై దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్‌ పటేల్‌, ఎఫ్‌ఎం మురళి (గోదారి కిట్టయ్య) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ‘‘ఈ సినిమా కాన్సెప్ట్‌ గురించి దర్శకులు చెప్పారు. మంచి సందేశాత్మక చిత్రంగా అనిపిస్తోంది. యువతరం కుటుంబ సమేతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా ఎదగాలనే సందేశం ఈ…

Read more

మహేష్‌చంద్ర దర్శకత్వంలో ‘పిఠాపురంలో’

తొలి చిత్రం ‘ప్రేయసి రావే’తోనే దర్శకునిగా తన సత్తా చాటుకున్నారు మహేష్‌ చంద్ర. ఆ తర్వాత “అయోధ్య రామయ్య, చెప్పాలని వుంది, జోరుగా హుషారుగా, ఒక్కడే, హనుమంతు, ఆలస్యం అమృతం, రెడ్‌ అలర్ట్‌” చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నారాయన. తాజాగా మహేష్‌ చంద్ర రూపొందించిన చిత్రం ‘పిఠాపురంలో’. దీనికి ఉప శీర్షిక ‘అలా మొదలైంది’. ‘నటకిరీటి’ డా. రాజేంద్రప్రసాద్‌, పృధ్వీరాజ్‌, కేదార్‌ శంకర్‌, మణిచందన, జయవాహిని, అన్నపూర్ణమ్మ తదితరులు ముఖ్య తారాగణంగా ఈ చిత్రం రూపొందింది. మహేష్‌ చంద్ర ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్‌ పటేల్‌, ఎఫ్ఎం మురళి (గోదారి కిట్టయ్య) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్‌ పార్ట్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది…

Read more