పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి
త్వరలో విడుదల కు సిద్ధమవుతున్న "" పోలీస్ వారి హెచ్చరిక "" సినిమా లోని సామాజిక చైతన్య గీతాన్ని ఎర్ర అక్షరాల రచయిత , తెలుగు రచయితల సంఘం అధ్యక్షుడు పరుచూరి గోపాల కృష్ణ ఆవిష్కరించారు....! అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వం లో రూపొందిన ఈ చిత్రాన్ని తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్థన్ నిర్మించారు ....! ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ "" చాలా రోజుల తరువాత వెండితెర పైన మళ్ళీ ఇటువంటి అభ్యుదయ గీతాన్ని చూస్తున్నాను , ఈ పాటలో ఉన్న గమ్మత్తు , వైవిధ్యం ఏమిటంటే ఇది ఏ పార్టీనో , ఏ సిద్ధాంతాన్నో ప్రచారం చేసే పాట కాదు , ఈ సినిమా కథ…
“పోలీస్ వారి హెచ్చరిక ” టీజర్ ను ఆవిష్కరించిన హీరో సుధీర్ బాబు
అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో బెల్లి జనార్థన్ నిర్మాతగా తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంలో రూపొందిన " పోలీస్ వారి హెచ్చరిక" టీజర్ ను తన కార్యాలయంలో సుధీర్ బాబు ఆవిష్కరించారు. ఈ చిత్రానికి కిషన్ సాగర్, నళినీ కాంత్ సినిమాటోగ్రాఫర్స్ గా పనిచేయగా గజ్వేల్ వేణు ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. శివ శర్వాణి ఈ చిత్రానికి ఎడిటింగ్ వర్క్ చేశారు. కాగా నేడు నవ దళపతి సుధీర్ బాబు చేతుల మీదగా ఈ చిత్ర టీజర్ విడుదల కావడం జరిగింది. ఈ సందర్భంగా నవ దళపతి సుధీర్ బాబు మాట్లాడుతూ... "దర్శకుడు బాబ్జీ మా మామగారైన సూపర్ స్టార్ కృష్ణ గారికి బాగా దగ్గరివాడు. దేశ వ్యాప్తంగా ఉన్న కృష్ణ…