అందం,అభినయంతో ఆకట్టుకుంటున్న నటి పోతన హేమ
రంగుల ప్రపంచంలోకి దూసుకొచ్చింది ఓ తార.. ఆటంకాలు, అడ్డంకులు దాటుకుని ఆత్మవిశ్వాసంతో సినీ ప్రయాణం చేస్తోంది యువనటి హేమ పోతన. అందం-అభినయంతో సినీ రంగంలో బంగారు భవిష్యత్‌ను నిర్మించుకుంటోంది. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయినా, దుఃఖాన్ని బలంగా మార్చుకుని జీవితాన్ని స్వయంగా తీర్చిదిద్దుకుంటోంది. విజయవాడకు చెందిన హేమ చిన్నప్పటి నుంచే జిజ్ఞాస, ధైర్యం అనే రెండు విలువలను ఒడిసిపట్టుకుని పెరిగింది. తల్లిదండ్రులు లేని లోటు ఉన్నప్పటికీ, బాధకు లోనవకుండా, “నా జీవితాన్ని నేను నిర్మించుకుంటాను” అనే స్పష్టమైన సంకల్పంతో హైదరాబాదులో అడుగుపెట్టింది. ఆ ధైర్యమే 2013లో ఆమెను మిస్ హైదరాబాద్ కిరీటం దక్కేలా చేసింది. అక్కడి నుంచి ఆమె ప్రయాణం కొత్త మలుపు తీసుకుంది. సినిమాలపై మక్కువతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన హేమ, 100%…
