పవర్ లిఫ్టింగ్ లో జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న నటి ప్రగతి
ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి, తన నటనతో సకుటుంబ ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకుంది నటి ప్రగతి. ఆమె నటిగా ఎంత ప్రతిభావంతురాలో, పవర్ లిఫ్టింగ్ లోనూ అంతకంటే ఎక్కువ టాలెంటెడ్. జిల్లా, ప్రాంతీయ, సౌతిండియాతో పాటు జాతీయ స్థాయిలో అనేక మెడల్స్ ఆమె గెల్చుకోవడం విశేషం. ఈ ఏడాది హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లెవెల్, తెలంగాణ స్టేట్ లెవెల్ పోటీల్లో గోల్డ్ మెడల్ గెల్చుకున్న ప్రగతి, కేరళలో జరిగిన నేషనల్ లెవెల్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లోనూ బంగారు పతకం గెల్చుకుంది. 2023లో పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనడం ప్రారంభించిన ప్రగతి..గత రెండేళ్లుగా హైదరాబాద్, తెలంగాణ, ఏపీతో పాటు జాతీయ స్థాయిలో పవర్ లిఫ్టింగ్ లో వరుసగా గోల్డ్ మెడల్స్ గెల్చుకుంటూ సత్తా చాటుతోంది…
