‘సరస్వతి’ గ్రిప్పింగ్ థ్రిల్లర్‌గా అందరినీ ఆకట్టుకుంటుంది: నిర్మాత పూజా శరత్ కుమార్
వెర్సటైల్ పాత్రలతో అలరిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో, తన సోదరి పూజా శరత్ కుమార్ తో కలిసి దోస డైరీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం'సరస్వతి'. హై-కాన్సెప్ట్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులలో క్యురియాసిటీ పెంచింది. మార్చి 6న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత పూజా శరత్ కుమార్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచకున్నారు. సరస్వతి ఎలా ఉండబోతుంది? సరస్వతి మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ట్విస్టులు ఉన్న వన్ ప్యాకేజ్ పటాక. మీరందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. రెండు గంటల సినిమాని ఎంత గ్రిప్పింగా చేయాలో అంత…
