Skip to content

పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ మొదటి గీతం ‘ఫైర్‌ స్టార్మ్’ విడుదల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శక్తివంతమైన పాత్ర ఓజాస్‌ గంభీరగా అలరించనున్న చిత్రం 'ఓజీ' (They Call Him OG). పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల్లో ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న 'ఓజీ' చిత్రం నుంచి మొదటి గీతం 'ఫైర్‌ స్టార్మ్' విడుదలైంది. ఈ గీతం నిజంగానే ఓ అగ్ని తుఫానులా ఉంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'ఓజీ' చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ భీకరమైన గ్యాంగ్‌స్టర్ అవతార్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి వంటి ప్రముఖ నటీనటులు…

Read more