తెలుగు సంస్కృతి, సంప్రదాయాల్ని చాటి చెప్పేలా మా ‘షష్టి పూర్తి’ చిత్రం ఉంటుంది.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్
నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్, అర్చన కాంబినేషన్ లో రూపేశ్, ఆకాంక్ష సింగ్ హీరో హీరోయిన్లుగా పవన్ ప్రభ దర్శకత్వంలో మా ఆయి (MAA AAIE) ప్రొడక్షన్స్ పతాకం పై రూపేష్ నిర్మించిన చిత్రం ‘షష్టిపూర్తి’. ఈ సినిమా మే 30న విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్ చేసిన పాటలు, టీజర్ ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌లో బజ్‌ను క్రియేట్ చేశాయి. ఇక శనివారం (మే 24) నాడు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ ఈస్ట్ శాసన సభ్యులు గద్దె రామ్మోహన్ , పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ‘మనం ఎవరో తెలియకుండానే ప్రేమించేది తల్లి.…