జాతీయ అవార్డ్స్ గెల్చుకున్న “బేబి” మూవీ టీమ్ ను సత్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డ్స్ లో రెండు పురస్కారాలు గెల్చుకున్న "బేబి" సినిమా టీమ్ ను అభినందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ రోజు జుబ్లీహిల్స్ లోని తన నివాసంలో "బేబి" సినిమా నిర్మాత ఎస్ కేఎన్, నిర్మాత, దర్శకుడు సాయి రాజేశ్, సింగర్ పీవీఎన్ఎస్ రోహిత్ ను సీఎం రేవంత్ రెడ్డి శాలువాతో సత్కరించారు. జాతీయ అవార్డ్స్ గెల్చుకున్న స్ఫూర్తితో మరిన్ని మంచి చిత్రాలు చేయాలని ఆయన ఆకాంక్షించారు. భారతీయ సినిమా నిర్మాణానికి కేంద్రంగా హైదరాబాద్‌ను నిలపాలని ముఖ్యమంత్రి అన్నారు. సినిమా రంగానికి ప్రోత్సాహాకానికి అవసరమైన చేయూతను అందిస్తామని ఆయన తెలిపారు. తమకు అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిర్మాత ఎస్ కేఎన్, నిర్మాత, దర్శకుడు సాయి రాజేశ్, సింగర్…