విశాల్ స్వీయ దర్శకత్వంలో రానున్న ‘మకుటం’ చిత్రానికి సంబంధించిన గ్రాండ్ క్లైమాక్స్ షూట్ పూర్తి
వెర్సటైల్ హీరో విశాల్ స్వీయ దర్శకత్వంలో ‘మకుటం’ చిత్రం రాబోతోంది. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆర్ బి చౌదరి 99వ చిత్రంగా రానున్న ఈ ప్రాజెక్ట్‌కి రవి అరసు కథను అందించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, గ్లింప్స్ సంచలనంగా మారాయి. ఇక తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. వరుసగా 17 రోజుల పాటు నిర్విరామంగా షూటింగ్ చేసినట్టుగా ప్రకటించారు. ఈ మేరకు చిత్రయూనిట్ నుంచి ఓ ప్రెస్ నోట్‌ని కూడా రిలీజ్ చేశారు. అందులో ఏముందంటే.. ‘విశాల్ స్వీయ దర్శకత్వంలో రానున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘మకుటం’ సినిమాకు సంబంధించిన గ్రాండ్ క్లైమాక్స్ షూటింగ్ పూర్తయింది. 17 రోజులుగా నిర్విరామంగా షూటింగ్ చేశాం. ఇంటెన్స్‌తో కూడిన…
