“డేవిడ్ రెడ్డి” నా అభిమానులకు ఫుల్ మీల్స్ లాంటి సినిమా అవుతుంది – గ్లింప్స్ లాంఛ్ లో రాకింగ్ స్టార్ మంచు మనోజ్
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ నటిస్తున్న కొత్త సినిమా "డేవిడ్ రెడ్డి". ఈ సినిమాను వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్, ట్రూ రాడిక్స్ బ్యానర్స్ పై వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్నారు. డైరెక్టర్ హనుమ రెడ్డి యక్కంటి రూపొందిస్తున్నారు. బ్రిటీష్ కాలం నాటి బ్యాక్ డ్రాప్ తో ఇంటెన్స్ యాక్షన్ డ్రామా కథతో భారీ పాన్ ఇండియా చిత్రంగా "డేవిడ్ రెడ్డి" సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో మారియా ర్యబోషప్క హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ రోజు "డేవిడ్ రెడ్డి" సినిమా గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్టంట్ కొరియోగ్రాఫర్…
