మిత్ర మండలి’ నుంచి ‘స్వేచ్ఛ స్టాండు’ విడుదల
'కత్తందుకో జానకి' శైలిలో 'మిత్ర మండలి' నుంచి మరో సరదా గీతం 'స్వేచ్ఛ స్టాండు' ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ స్థాపించిన నిర్మాణ సంస్థ బి.వి. వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'మిత్ర మండలి'. అభిరుచి గల నిర్మాతలు కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంతో సోషల్ మీడియా సంచలనం నిహారిక ఎన్.ఎం. తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. నూతన దర్శకుడు విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, 'కత్తందుకో జానకి' గీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా…