“చిరంజీవ” సినిమా ఘనవిజయం సాధించాలి – డైరెక్టర్ అనిల్ రావిపూడి
రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఆహా ఒరిజినల్ ఫిల్మ్ "చిరంజీవ". ఈ చిత్రంలో కుషిత కల్లపు హీరోయిన్ గా నటించింది. స్ట్రీమ్ లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాహుల్ అవుదొడ్డి, సుహాసినీ రాహుల్ నిర్మించారు. అభినయ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ నెల 7వ తేదీ నుంచి చిరంజీవ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ రోజు ఈ సినిమా ప్రెస్ ప్రీమియర్ షో, ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాకెట్ రాఘవ మాట్లాడుతూ - అభితో కలిసి జబర్దస్త్ చాలా ఎపిసోడ్స్ చేశాం. ఆయన ఏ స్కిట్ చేసినా…
