Skip to content

హాలీవుడ్ లో జాలీగా సందడి చేసిన మన తెలుగు హీరో రాజ్ దాసిరెడ్డి!!

ఈరోజు మన తెలుగు చిత్రసీమను టాలీవుడ్ అంటున్నామన్నా... హిందీ ఇండస్ట్రీని "బాలీవుడ్", కన్నడ పరిశ్రమను "శాండల్ వుడ్", మలయాళంను "మల్లువుడ్", తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీని "కోలీవుడ్"గా పిలుచుకుంటున్నామంటే... దానికి ప్రేరణ "హాలీవుడ్" అన్న విషయం అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా పతాక గత కొన్ని సంవత్సరాలుగా అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడుతున్నా.... మన దేశంలో రూపొందిన ఏదైనా సినిమా అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కితే... దానిని "హాలీవుడ్ స్థాయిలో రూపొందిన చిత్రంగా అభివర్ణించడం ఇప్పటికీ సర్వసాధారణం. అంతేకాదు... సినిమాలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత పురస్కారం "ఆస్కార్"ను అందించేది కూడా హాలివుడ్డే. అందుకే "ట్రిపులార్" చిత్రం ఆస్కార్ అందుకోవడాన్ని మన దేశం మొత్తం గర్వాతిశయంతో సెలబ్రేట్ చేసుకుంది. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే... ఇంతటి ప్రతిష్టాత్మక ఆస్కార్…

Read more