అభిమాని రాజేశ్వరి పట్ల మెగాస్టార్ చిరంజీవి ఆత్మీయ స్పందన
మహోన్నతమైన వ్యక్తిత్వం, యెనలేని సేవాతత్వంతో కోట్లాది మంది అభిమానుల గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించిన మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మానవత్వాన్ని చాటారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఆదోని పట్టణానికి చెందిన చిరంజీవి వీరాభిమాని రాజేశ్వరి, మెగాస్టార్ ని కలవాలనే కలతో సైకిల్‌పై హైదరాబాద్‌కు సాహసోపేత ప్రయాణం మొదలుపెట్టారు. ఎన్నో శారీరక, మానసిక సవాళ్లు ఎదురైనా చిరంజీవిపై వున్న అపారమైన అభిమానమే ఆమెను విజయవంతంగా ముందుకు నడిపింది. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి, రాజేశ్వరిని హృదయపూర్వకంగా ఆహ్వానించారు. ఆమె అంకితభావానికి, తనను చేరుకోవడానికి చేసిన కృషికి చలించిపోయిన చిరు, ఒక చిరస్మరణీయ జ్ఞాపకాన్ని ఇచ్చారు. ఆ సందర్భంలో రాజేశ్వరి, మెగాస్టార్ కి రాఖీ కట్టగా, ఆమెకు ఆశీస్సులు అందించి అందమైన సాంప్రదాయ చీరను బహుమతిగా…