‘ఘాటి’ ఫస్ట్ సింగిల్ వైబ్రంట్ ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్
క్వీన్ అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఘాటి' గ్లింప్స్ లో ఇంటెన్స్ వైలెంట్ క్యారెక్టర్ లో అందరినీ ఆశ్చర్యపరిచారు. తమిళ స్టార్ విక్రమ్ ప్రభు ఇంటెన్స్ అవతార్ లో కనిపించిన క్యారెక్టర్ గ్లింప్స్ సినిమాపై ఉన్న బజ్‌ను మరింత పెంచింది. ఘాటిని UV క్రియేషన్స్ సమర్పిస్తుంది. రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తారు. ఘాటి జూలై 11న రిలీజ్ కానుంది. మేకర్స్ తాజాగా జానపద ఊపుతో నిండిన పాట "సైలోరే" సాంగ్ ని విడుదల చేశారు. ఇది ఓ ఎనర్జిటిక్ బ్లాస్టర్‌లా ఉంది. ప్రకృతిసౌందర్యంతో నిండిన అడవులను నేపథ్యంగా చేసుకున్న ఈ ఫోక్ వెడ్డింగ్ యాంథమ్‌లో లీడ్ పెయిర్ ఉత్సవంగా కనిపించి ప్రేక్షకులను అలరించారు…