‘గాడ్స్ అండ్ సోల్జర్’ టైటిల్ టీజర్ విడుదల
గోలీసోడా', గోలీసోడా-2 చిత్రాల దర్శకుడు,ప్రముఖ కెమెరామెన్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో గోలీసోడా ఫ్రాంఛైజీ లో భాగంగా గోలీసోడాలోని స్పిరిట్‌ను.. ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ద్వి భాషా చిత్రగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రాజ్ తరుణ్ కథానాయకుడు. ఆయన చిత్రంతో తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. సునీల్, వేదన్, భారత్, అమ్ము అభిరామి, కిషోర్, జెఫ్రీరి, భరత్ శ్రీని, పాల డబ్బా, విజిత తదితరులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. రఫ్ నోట్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మాణంలో జరుపుకుంటోన్న ఈ చిత్రానికి వినాయక చవితి పర్వదినాన 'గాడ్స్ అండ్ సోల్జర్'గా టైటిల్‌ని ఫిక్స్ చేసి ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్.…