ఘనంగా అధికార ప్రదానోత్సవం
మణికొండలోని శ్రీ చైతన్య పాఠశాలలో అధికార ప్రదానోత్సవం(ఇన్వెస్టిచర్ సెర్మనీ) కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. 2025–2026 ఏడాదికి సంబంధించి విద్యార్థులకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేంద్ర ముఖ్య అతిథిగా హాజరై, హెడ్ బాయ్, హెడ్‌గర్ల్, హౌస్ కెప్టెన్స్‌కి బ్యాడ్జ్‌లను అందజేశారు. ఈ సందర్భంగా కస్తూరి నరేంద్ర మాట్లాడుతూ–‘‘విద్యార్థులు చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. తల్లితండ్రులు ఆశలు, టీచర్లు ఆకాంక్షలను విద్యార్థులు నెరవేర్చాలి. అదేవిధంగా అంకితభావం, వినయం, విధేయత, సమాజానికి సేవ చేయడం వంటి అంశాలను కూడా అలవర్చుకోవాలి’’ అన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ అనిత మాట్లాడుతూ–‘‘విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను విద్యార్థుల్లో…
