‘నారి నారి నడుమ మురారి’ అందరూ ఎంజాయ్ చేసే ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్: సంయుక్త
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి'. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. జనవరి 14న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా సంయుక్త విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. సంక్రాంతికి రావడం ఎలా అనిపిస్తుంది ? సంక్రాంతికి రావడం చాలా ఆనందంగా ఉంది. సంక్రాంతి చాలా పెద్ద పండుగ. సంక్రాంతికి వచ్చే ప్రతి సినిమాకి మంచి ఆదరణ ఉంటుంది. ఇది చాలా క్లీన్ కామెడీ…
